నెయ్యి వాడకం ఈ కాలంలో పెరిగిపోయింది. ఇంట్లోనే తయారుచేసిన దేశీ నెయ్యిని తెలుగు రాష్ట్రాల్లో అధికంగా వాడతారు. నెయ్యి వేస్తే ఏ ఆహారానికైనా ప్రత్యేకమైన రుచి వస్తుంది. కూరల్లో, పప్పుల్లో, పులావ్, బిర్యానీల్లో రెండు స్పూనుల నెయ్యిని వేస్తూ ఉంటారు. వీటిల్లో నెయ్యిని చేర్చడం వల్ల ఆహార రుచి పెరగడమే కాకుండా ఆరోగ్యానికి సంబంధించిన అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. నెయ్యిలో ఉండే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఎ వంటి అనేక పోషకాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అదనంగా, నెయ్యిలో ఉండే బ్యూటిరిక్ ఆమ్లం ఉంటుంది. ఇది శరీరంలోని వ్యాధులతో పోరాడేందుకు అవసరమైన T-కణాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ కొందరికి మాత్రం దీనివల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని ఆరోగ్యసమస్యలు ఉన్నవారు నెయ్యిని ఎక్కువగా తీసుకోవడం వల్ల హాని కలిగే అవకాశం ఉంది. ఎవరు నెయ్యి అధికంగా తినకూడదో తెలుసుకోండి.
ఈ సమస్యలు ఉంటే నెయ్యి తినవద్దు
మీకు ఇప్పటికే అజీర్ణం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు ఉంటే జాగ్రత్తగా ఉండాలి. జీర్ణసమస్యలు ఉన్నవారు నెయ్యిని ఎక్కువగా తీసుకోవడం ఆ సమస్య మరింతగా పెరుగతుంది. ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంది.
గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు అధిక మొత్తంలో నెయ్యి తీసుకోవడం ప్రమాదకరం. నెయ్యిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్, గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి. అటువంటి పరిస్థితిలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి 10 మి.గ్రా కంటే ఎక్కువ నెయ్యి తీసుకోకండి.
మీరు మీ బరువు తగ్గించే ప్రయాణంలో ఉంటే, పొరపాటున కూడా ఎక్కువ నెయ్యి తినకండి. నెయ్యిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఒక వ్యక్తి బరువు పెరుగుతాడు. నెయ్యిలో కంజుగేటెడ్ లినోలెయిక్ ఆమ్లం (సిఎల్ఎ) ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కానీ నెయ్యిని అధికంగా తింటే మాత్రం నెయ్యిలోని అధిక కేలరీలు శరీరంలో చేరుతాయి. ఇది తీసుకుంటే ఒక వ్యక్తి ఊబకాయులుగా మారవచ్చు.
జలుబు, జ్వరం వచ్చినప్పుడు నెయ్యి తినకపోవడమే మంచిది. సాధారణంగా జలుబులో కఫం ఉత్పత్తి అవుతుంది. నెయ్యి తినడం ద్వారా నెయ్యి మరింతగా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది.
మీకు పాలు అలెర్జీ ఉంటే నెయ్యి తినకూడదు. నెయ్యి, పాలు రెండూ పాల ఉత్పత్తులు. అటువంటి పరిస్థితిలో, మీకు పాల అలెర్జీ ఉంటే, నెయ్యి లేదా పాల నుండి తయారైన అన్ని ఉత్పత్తులను తినడం మానుకోవాలి. నెయ్యి తిన్న తర్వాత చర్మంపై దద్దుర్లు, వాంతులు, కడుపులో గ్యాస్, తిమ్మిరి, ఉబ్బరం, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పాల అలెర్జీని లాక్టోస్ ఇంటాలరెన్స్ అని పిలుస్తారు. ఈ సమస్య పిల్లలు, పెద్దల్లో కూడా ఉండవచ్చు. కాబట్టి నెయ్యి రోజులో ఒక స్పూను కన్నా ఎక్కవ తినకపోవడమే మంచిది.