పతకాలు సాధిస్తే ప్రశంసు, పురస్కారాలు..
ఏపీలో క్రీడల్లో పతకాలు సాధిస్తే వారిక పురస్కారాలు, నజరానాలు, భారీ బహుమతులు, ప్రభుత్వ ఉద్యోగాలు దక్కుతున్నాయి. ఈ క్రమంలో ఊరు పేరు లేని క్రీడా సంఘాలు రాష్ట్ర, జాతీయ స్థాయి ఈవెంట్ల పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్నాయి. గత కొన్నేళ్లుగా ప్రభుత్వ నోటిఫికేషన్లలో కొన్ని నకిలీ సంఘాలు జారీ చేసిన ఫేక్ సర్టిఫికెట్లతో పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు దక్కించుకున్నారు. శాప్ సహకారంతో జరిగిన కోట్ల రుపాయల స్కామ్ వ్యవహారంపై కొన్నాళ్లుగా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే కొందరు నేషనల్ గేమ్స్‌లో ఏపీ జట్లు పాల్గొనకుండా అడ్డుతగులుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.