హోండా తన పాపులర్ డియో స్కూటర్ 2025 మోడల్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త మోడల్ ఎక్స్ షోరూమ్ ధరను రూ.74,930గా నిర్ణయించింది. అంటే ఇది ప్రస్తుత మోడల్ కంటే సుమారు 1500 రూపాయలు ఎక్కువ. 

2025 వెర్షన్‌లో అప్డేటెడ్ ఓబీడీ2బీ కంప్లైంట్ ఇంజిన్‌ను ఇచ్చింది కంపెనీ. ఈ 110సిసి సింగిల్ సిలిండర్ పాత మోడల్ మాదిరిగానే శక్తిని ఇస్తుంది. సివిటి గేర్ బాక్స్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. దీని మైలేజ్ ఫిగర్ గురించి కంపెనీ ఎటువంటి సమాచారాన్ని పంచుకోలేదు. దీని ఏఆర్ఏఐ ఇంధన సామర్థ్యం మారుతుందని భావిస్తున్నారు.

హోండా డియో ఫీచర్లు

2025 డియో స్కూటర్ ఫీచర్ల చూస్తే.. ఇది 4.2-అంగుళాల టిఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది. ఇది క్లస్టర్ డిస్టెన్స్, ట్రిప్ మీటర్, ఎకో ఇండికేటర్ వంటి బహుళ రైడ్ డేటాను చూపిస్తుంది. ఇందులో టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. కొత్త డియో ఎస్‌టీడీ, డీఎల్‌ఎక్స్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. డీఎల్ఎక్స్‌ను రూ.85,648కు విక్రయిస్తున్నారు. ఎందుకంటే ఇందులో అన్ని ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్ కోసం భారతదేశం అంతటా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. దీని డెలివరీ ఈ నెలాఖరులో ప్రారంభం కానుంది.

కొత్త డెస్టినీ 125 లాంచ్

మరోవైపు హీరో మోటోకార్ప్ కొత్త డెస్టినీ 125 స్కూటర్ ను కూడా విడుదల చేసింది. వీఎక్స్, జెడ్ఎక్స్, జెడ్ఎక్స్ ప్లస్ అనే మూడు వేరియంట్లలో ఈ స్కూటర్ లాంచ్ అయింది. వీటి ఎక్స్ షోరూమ్ ధరలు రూ.80,450, రూ.89,300, రూ.90,300గా నిర్ణయించారు. 

హీరో డెస్టినీ 125 ఆకర్షణీయమైన డిజైన్, మంచి బాడీవర్క్, ఎల్ఈడీ హెడ్‌లైట్లు, టర్న్ ఇండికేటర్స్ వంటి ఆధునిక అంశాలను కలిగి ఉంది. వీటిని ఆప్రాన్‌కు చక్కగా జతచేస్తారు. దీని టెయిల్ లైట్ కూడా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. హీరో డెస్టినీ 125 వీఎక్స్ ఎటర్నల్ వైట్, రీగల్ బ్లాక్, గ్రూవీ రెడ్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here