మహా కుంభమేళా భక్తజనంతో కిక్కిరిసిపోతోంది. తొలి రోజే భక్తులు పోటెత్తారు. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద దాదాపు 1.50 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించారు. రెండో రోజు మంగళవారం మకర సంక్రాంతి రోజున భక్తులు మొదటి పుణ్య స్నానాలు (అమృత స్నాన్) చేశారు. మొత్తం 3.5కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమానికి తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం పేర్కొంది.