అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్ల పూర్తైన సందర్భంగా అక్కినేని నాగార్జున ప్రత్యేక వీడియో విడుదల చేశారు. స్టూడియో 50 ఏళ్ల క్రితం సంక్రాంతి పండుగ రోజున ప్రారంభమైందని తెలిపారు. అప్పటి నుంచి ప్రతి సంక్రాంతికి తాము ఇక్కడ అందరితో కలిసి టిఫిన్ చేయడం ఒక సంప్రదాయంగా మారిందని పేర్కొన్నారు. దీన్ని ఇలానే ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు.