వరంగల్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఎనుమాముల, గీసుకొండ, దామెరబొడ్డు, చింతలపల్లి గ్రామాల్లో వరుస చోరీలకు పాల్పడ్డారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లే టార్గెట్‌గా దొంగతనాలకు పాల్పడ్డారు. భారీగా బంగారం, నగదు దోచుకెళ్లారు. వరుస చోరీలతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.