ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025లో అనేక కార్లు ప్రదర్శనకు రానున్నాయి. పలు కంపెనీలు తమ కొత్త వాహనాలను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు కొన్ని కంపెనీలు తమ ప్రత్యేకమైన వాహనాలతో కస్టమర్లను సర్‌ప్రైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. జెన్సోల్ ఈవీ కూడా కొత్త ఎంట్రీ రానుంది. దీని కారును భారత్‌లో పలుమార్లు పరీక్షించారు. భారతదేశంలో ప్రస్తుత ఎలక్ట్రిక్ కార్ల మాదిరిగా కాకుండా జెన్సోల్ ఈవీ మూడు చక్రాల ఎలక్ట్రిక్ కారుగా ఉంటుంది. దీనికి ఇజియో అని పేరు పెట్టారు.

200 కి.మీ రేంజ్

టెస్టింగ్ సమయంలో బయటకు వచ్చిన ఫోటోల్లో కారు డిజైన్ కనిపించింది. ఈ వాహనాన్ని ఏఆర్ఏఐ పరీక్షించి ఉండవచ్చు. జెన్సోల్ ఈవీ వెబ్‌సైట్ ప్రకారం.. కంపెనీ మొదటి ఎలక్ట్రిక్ కారు ఏఆర్ఏఐ సర్టిఫికేషన్ పొందింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే గంటకు 200 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని కంపెనీ హామీ ఇస్తోంది.

ఇతర ఫీచర్లు

ఈ వాహనం వెనుక భాగంలో ఇజియో బ్యాడ్జింగ్ ఉంటుంది. కంపెనీ అధికారికంగా అదే పేరుతో టీజర్ ను కూడా విడుదల చేసింది. ఇజియో బ్యాడ్జ్‌తోపాటు, ఈవీ బ్యాడ్జ్‌ను టీల్ బ్లూ షేడ్‌లో చూడవచ్చు. ముందు భాగంలో ఇది సాధారణ హెడ్ లైట్లు, ఫాగ్ లైట్లు, క్లోజ్డ్ గ్రిల్‌తో కనిపిస్తుంది.

ఫ్రంట్ విండ్ షీల్డ్‌కు వైపర్ బ్లేడ్‌ను అమర్చారు. వెనుక భాగంలో సౌకర్యవంతమైన బూట్‌తో టెయిల్ గేట్ ఉన్నట్లు తెలుస్తోంది. దాని పక్కనే జెన్సోల్ ఇజియో టెయిల్ లైట్లు ఉన్నాయి. షార్క్ ఫిన్ యాంటెనా, డ్యూయల్ టోన్ బ్లాక్ రూఫ్ కూడా చూడవచ్చు. ఈ స్పై షాట్లలో ఇజియో ఈవీ బయట మాత్రమే కనిపించింది. ఇందులో మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్, ఫ్రీ స్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here