వరుస విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’. బాబీ కొల్లి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో అడుగుపెట్టింది. మాస్ ప్రేక్షకులతో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. (Daaku Maharaaj)

 

‘డాకు మహారాజ్’ చిత్రం మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.56 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇది బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్ కావడం విశేషం. సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో రెండో రోజు నుంచి కూడా ఈ సినిమాకి మంచి వసూళ్లు వస్తున్నాయి. రెండో రోజు రూ.18 కోట్ల గ్రాస్, మూడో రోజు రూ.18 కోట్ల గ్రాస్, నాలుగో రోజు రూ.13 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో ‘డాకు మహారాజ్’ మూవీ నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.105 కోట్ల గ్రాస్ సాధించింది. ప్రస్తుత వసూళ్ల జోరు చూస్తుంటే.. ఫుల్ రన్ లో రూ.200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే బాలకృష్ణ రూ.200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన మొదటి సినిమాగా ‘డాకు మహారాజ్’ నిలవనుంది.

 

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here