బీదర్ లోని ఎస్బీఐ బ్రాంచ్ ముందు ఈ సంఘటన జరిగింది. దొంగల ముఠా రూ.93 లక్షల నగదుతో పారిపోయారు. ఏటీఎంలో డబ్బు పెట్టే వాహనాన్ని ముందు నుంచీ అనుసరించిన దొంగలు, బ్యాంకు వద్ద దాడి చేశారు. వాహనంలోని గార్డులలో ఒకరైన గిరి వెంకటేష్ దుండగుల కాల్పుల్లో అక్కడికక్కడే మరణించగా, మరొక గార్డు శివకుమార్ తీవ్ర గాయాలపాలయ్యాడు. శివకుమార్ ను ఆసుపత్రికి తీసుకెళ్తున్న క్రమంలో అతడూ మరణించాడు. కాల్పులు జరపడానికి ముందు దొంగలు ఏటీఎం వ్యాను గార్డులపై కారం పొడి చల్లారు. బీదర్ ఎస్పీ ప్రదీప్ గుంటి ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు.