ప్రధాని మోదీ మహారాష్ట్రలో పర్యటించారు. కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా, రెండు అత్యాధునిక యుద్ధనౌకలు INS సూరత్, INS నీలగిరి, అలాగే జలాంతర్గామి వాఘ్షీర్ని ఆయన జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమం దేశానికి రక్షణ రంగంలో గర్వకారణంగా నిలుస్తుందని నిపుణులు అంటున్నారు.