మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ఈడీ విచారణకు హాజరు అయ్యారు. ఫార్ములా-ఈ రేస్ కేసులో జనవరి 7న నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు.. ఇవాళ విచారణకు రావాలని పిలిచారు. గండిపేట ఫాంహౌస్ నుండి బయలు దేరి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. కేటీఆర్ వాహనాన్ని మాత్రమే లోపలికి అనుమతించారు.