కూటమి పార్టీలు జట్టుకట్టడానికి కీలకంగా వ్యవహరించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్…డిప్యూటీ సీఎం ఒక్కరే ఉండాలని షరతు విధించినట్లు సమాచారం. సీఎం చంద్రబాబు సైతం పొత్తు ధర్మంలో భాగంగా డిప్యూటీ సీఎంగా పవన్ ఒక్కరినే నియమించారు. ఇటు పార్టీలో, అటు ప్రభుత్వం కీలకంగా వ్యవహరిస్తున్న లోకేశ్ ను..డిప్యూటీ సీఎం హోదాలో చూడాలని టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి. కాకినాడ పోర్టు, తిరుపతి తొక్కిసలాట, నియోజకవర్గాల్లో పర్యటనలు, పాలనలో పవన్ కల్యాణ్ తన మార్క్ చూపిస్తుండడంతో…రానున్న కాలంలో పరిస్థితులు ఎలా మారతాయో అని టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.
Home Andhra Pradesh ఏపీ రాజకీయాల్లో కీలకంగా ‘డిప్యూటీ సీఎం’ హోదా- లోకేశ్ ను రంగంలోకి దించాలంటున్న టీడీపీ శ్రేణులు!-ap...