ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ విభాగాలకు నగరంలో ఎక్కడేమి జరుగుతుందో తెలిసినా వాటిని ఉన్నతాధికారులకు నివేదించకుండా గుట్టుగా వ్యవహరిస్తున్నారు. అక్రమంగా మట్టి, రేషన్ బియ్యం తరలించే ముఠాలతో అంటకాగడంతోనే పోలీసుల్ని వారు ఖాతరు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. బుధవారం రాత్రి పోలీసులపై జరిగిన దాడిలో కూడా ఈ ముఠాలే కీలక పాత్ర పోషించాయి. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులపై దాడి జరిగినా తోపులాట మాత్రమే జరిగిందనే కవరింగ్ ఇస్తున్నారు. పోలీసులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.
Home Andhra Pradesh బెజవాడలో బరి తెగించారు.. జూదాన్ని అడ్డుకున్న పోలీసులపై దాడి చేసిన బెట్టింగ్ మాఫియా-betting mafia attacks...