ఇంటీరియర్ విషయానికొస్తే ఇందులో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఈ యూనిట్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోను పొందదు. రివర్స్ పార్కింగ్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, మహీంద్రా బ్లూసెన్స్ కనెక్టివిటీ యాప్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి. స్మార్ట్ స్టోరేజ్ స్పేస్ ఆప్షన్‌గా డ్రైవర్ సీటు కింద అండర్ సీట్ స్టోరేజ్ ట్రే కూడా ఉంది.