CM Revanth Reddy : సింగపూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, సెంట్రల్ కాలేజీతో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ మధ్య సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కీలకమైన ఒప్పందం కుదిరింది. సింగపూర్ ఐటీఈలో సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధి సహా 20కి పైగా విభిన్న డొమైన్ల పనితీరును సీఎం పరిశీలించారు.