ఏడు నెలల్లో అద్భుతాలు
ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతికి కేంద్రం రూ. 15,000 కోట్లు ఈఏపీ ద్వారా ఇప్పించిందన్నారు. నిలిచిపోయిన పోలవరానికి రూ. 12,157 వేల కోట్లు సాధించామని తెలిపారు. రైల్వే జోన్ కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. ఏడు నెలల్లో రూ. 4 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని, రూ. 2 లక్షల 8 వేల కోట్ల పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారని తెలిపారు. టీసీఎస్ రాకతో యువతకు ఉద్యోగాలు వస్తాయని, గూగుల్, ఏఐ, డేటా సెంటర్ తో మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఇక్కడి నుంచి సింగపూర్ కు సీ కేబుల్ వేసి అనుసంధానిస్తామని స్పష్టం చేశారు. గ్రీన్ హైడ్రోజన్ పై ఎన్టీపీసీ, జెన్ కో జాయింట్ వెంచర్ గా రూ. లక్షా 80 వేల కోట్లు ఖర్చు పెట్టబోతున్నామని తెలిపారు.