నెటిజన్ల స్పందన
ఈ కొత్త ఛార్జ్ ఇష్యూపై సోషల్ మీడియాలో ప్రజలు స్పందిస్తూ ఇలాంటి ప్లాట్ ఫామ్ ల్లో ఇలాంటి రహస్య ఛార్జీలు ఎప్పుడు అంతమవుతాయని ప్రశ్నిస్తున్నారు. రంజన్ పోస్టుకు స్పందించిన అనూష వి.. ‘ఓ మై గాడ్, ఇది ఎక్కడ ముగుస్తుంది?’ అని ప్రశ్నించింది. మరికొందరు వినియోగదారులు ఈ పోస్ట్ పై గోయల్ ప్రతిస్పందనను ప్రశంసించారు. గోయల్ స్పందించిన గంట నుంచి గంటన్నర వ్యవధిలోనే కంపెనీ వైపు నుండి సమస్యను పరిష్కరించారు. గోయల్ హామీ ఇచ్చిన ప్రకారం హిడెన్ చార్జ్ ను తొలగించారు. శుక్రవారం మార్కెట్ (stock market) సెషన్లో జొమాటో షేరు ధర 3.02 శాతం పెరిగి రూ.249.30 వద్ద ట్రేడవుతోంది.