AP New DGP: ఆంధ్రప్రదేశ్ డీజీపీ రేసులోకి మళ్లీ హరీష్ కుమార్ గుప్తా పేరు వినిపిస్తోంది. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమల రావు నెలాఖర్లో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త డీజీపీ ఎంపికపై చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి దావోస్ పర్యటన తర్వాత డీజీపీ ఎంపిక కసరత్తు కొలిక్కి రానున్నట్టు తెలుస్తోంది.