బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్‌లు కలిసి నటిస్తోన్న చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ఈ సినిమాలో బ్రహ్మానందం, గౌతమ్‌లు తాత మనవడిగా సందడి చేయనున్నారు. వెన్నెల కిశోర్, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.