బాలకృష్ణ, దర్శకుడు బాబి కొల్లి కాంబోలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన సినిమా ‘డాకు మహారాజ్’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతుల హీరోయిన్లుగా.. బాబీ డియేల్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇప్పటికే మంచి టాక్ సంపాదించిన ఈ మూవీ గురించి మరిన్ని విశేషాలు ప్రత్యేక ఇంటర్వ్యూలో బాలయ్య మాట్లాడారు.