చర్చ అది కాదు..
‘ఇప్పుడు పాత 90 లక్షల రేషన్ కార్డులు చర్చ కాదు. గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు లేకుండా.. కొత్తగా పెళ్లైన వారికి, కొత్త కుటుంబాలు, మార్పులు చేర్పులు, అర్హత ఉండి కొత్త రేషన్ కార్డులు రాని వారికి శుభవార్త చెబుతున్నాం. వారికి జనవరి 26 నుంచి రేషన్ కార్డులు ఇస్తున్నాం. ప్రతిపక్షాలు కావాలని రాజకీయం చేసి రాద్ధాంతం చేస్తున్నాయి. రేషన్ కార్డు అర్హత ఉండి రాకుంటే.. సంబంధిత అధికారికి, ప్రజా ప్రతినిధులకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వచ్చు’ అని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.