హ్యుందాయ్ క్రెటా ఈవీ ఫీచర్ హైలైట్స్ ఏమిటి?
హ్యుందాయ్ (hyundai cars) క్రెటా ఈవీ ఫీచర్లతో నిండి ఉంది. ఇందులో 8 స్పీకర్ల బోస్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్ రూఫ్, వైర్ లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్, డ్యాష్ బోర్డుపై కర్విల్లినియర్ స్క్రీన్, ఆల్ డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, ఆర్మ్ రెస్ట్ కింద కూల్డ్ స్టోరేజ్ కంపార్ట్ మెంట్, ఫ్రంట్ సీట్ వెంటిలేషన్, ఎలక్ట్రానిక్ గా అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, లెవల్ 2 ఏడీఏఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. హ్యుందాయ్ క్రెటా ఈవీ లో అయోనిక్ 5 నుండి ప్రేరణ పొందిన కొత్త స్టీరింగ్ వీల్, మోర్స్ కోడ్ లో ‘హెచ్’ ను సూచించే నాలుగు చుక్కలను పొందుతుంది. ‘డ్రైవర్ ఓన్లీ’ ఏసీ మోడ్ కూడా ఉంది. ఇది డ్రైవర్ వైపు ఉన్న ఎయిర్ వెంట్లను మాత్రమే యాక్టివేట్ చేస్తుంది. హ్యుందాయ్ క్రెటా ఈవీ (electric cars in india) ముందు రెండు సీట్ల వెనుక భాగంలో ఫోల్డౌట్ ట్రేలు, వెనుక విండో కర్టెన్లు, స్టోరేజ్ కోసం బానెట్ కింద 21 లీటర్ల ఫ్రంక్ ఉన్నాయి.