మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంట్రీ ఇచ్చింది! సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా.. ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగంలోకి ప్రవేశించింది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఆటో ఎక్స్పో 2025లో కొత్త ఈ-యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఆవిష్కరించింది. ఇండియాలోనే బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌లో ఒకటైన సుజుకీ యాక్సెస్ 125 సీసీ పెట్రోల్ స్కూటర్‌కి ఇది ఈవీ వర్షెన్‌గా మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. సరళమైన స్టైలింగ్, ప్రాక్టికల్ స్పెసిఫికేషన్లతో కుటుంబ కొనుగోలుదారును ఈ ఈ-స్కూటర్ లక్ష్యంగా చేసుకుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లో హోండా యాక్టివా, బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ రిజ్టా, ఓలా ఎస్ 1 వంటి వాటికి కొత్త సుజుకీ ఈ-యాక్సెస్ గట్టి పోటీ ఇవ్వనుంది.