Drone Flying Over Pawan Office : మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయం, నిర్మాణంలో ఉన్న జనసేన కేంద్ర కార్యాలయ భవనంపై గుర్తు తెలియని డ్రోన్ చక్కర్లు కొట్టింది. ఈ విషయాన్ని క్యాంపు కార్యాలయం సిబ్బంది పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. డిప్యూటీ సీఎం భద్రతా సిబ్బంది డ్రోన్ విషయాన్ని డీజీపీ, గుంటూరు జిల్లా కలెక్టర్‌, ఎస్పీకి సమాచారం అందించారు. శనివారం మధ్యాహ్నం 1:30 నుంచి 1:50 గంటల వరకూ దాదాపు 20 నిమిషాల పాటు డ్రోన్ ఎగిరినట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here