మావోయిస్టు పార్టీ ప్రకటన

ఛత్తీస్ గఢ్ బీజాపూర్ జిల్లాలోని ఉసుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజారి కంకేర్ గ్రామంలో జనవరి 16న మావోయిస్టులపై భద్రతా దళాలు దాడి చేశారు. ఈ దాడిలో దామోదర్, హంగీ, దేవే , జోగా, నరసింహారావు వంటి కీలక నేతలు మృతి చెందారని సీపీఐ(మావోయిస్టు) సౌత్ బస్తర్ డివిజన్ ఓ ప్రకటనలో తెలిపింది. భద్రతా దళాలు బీజాపూర్ జిల్లాలోని పూజారి కంకేర్ ప్రాంతంలో “ఆపరేషన్” పేరుతో అమానవీయ అణచివేతకు పాల్పడ్డారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. బస్తర్ సహజ వనరులను దోచుకోవడానికి, గిరిజనుల భూములు దోచుకోవడానికి, అడవుల నుంచి గిరిజనులను నిర్మూలించడం ఈ దాడులని విమర్శించింది. అయితే ఈ ఆపరేషన్ లో 18 మంది మావోయిస్టులు మరణించారని సీపీఐ(మావోయిస్టు) స్పష్టం చేసింది. కామ్రేడ్ బడే చొక్కారావు (దామోదర్ దాదా) ధైర్యసాహసాలను ప్రదర్శించి, పోరాడుతూ అమరుడయ్యాడని సీపీఐ(మావోయిస్టు) పార్టీ తెలిపింది. అతని మరణం మావోయిస్టు పార్టీకి కోలుకోలేని నష్టాన్ని కలిగించిందని పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here