“పెరిగిన ద్రవ్యోల్బణాన్ని అనుసరించి రేషన్ కార్డుల కోసం కుటుంబ ఆదాయ పరిమితిని గ్రామీణ ప్రాంతాల్లో 2.55 లక్షలుగా, పట్టణ ప్రాంతాల్లో 3.40 లక్షలుగా సవరించి పెంచాలి. తద్వారా పేదలందరికీ లబ్ది చేకూరే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గతంలో మా సర్కార్ నిర్ణయం వల్ల జర్నలిస్టులు, ప్రైవేటు ఉద్యోగులు, చిరు ఉద్యోగులు ఇలా ఎంతో మంది తెల్ల రేషన్ కార్డులు పొందారు. మేనిఫెస్టోలో మేము పెట్టక పోయినప్పటికీ రేషన్ కార్డు ద్వారా కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి ఇచ్చే బియ్యంను 4 కేజీల నుంచి 6 కేజీలకు పెంచడం జరిగింది” అని హరీశ్ రావు గుర్తు చేశారు.