తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదీ జలాల పునర్విభజనపై కృష్ణా జలవివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ-2) వాదనలు విననుంది. 1956 అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టంలోని సెక్షన్-3 ప్రకారం 2023 అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వం కేడబ్ల్యూడీటీ-2కు కొత్త టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చింది.