సీతారామం మూవీలో తన అందమైన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న నార్త్ ఇండియన్ భామ మృణాల్ ఠాకూర్(Mrunal thakur)ఆ తర్వాత హాయ్ నాన్న,ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలతో అగ్ర హీరోయిన్ రేంజ్ కి వెళ్లిందని కూడా చెప్పవచ్చు.ప్రస్తుతం అడవి శేషు హీరోగా తెరకెక్కుతున్న ‘డెకాయిట్’ లో కూడా నటిస్తుంది.
మృణాల్ ఠాకూర్ రీసెంట్ గా బాలీవుడ్ లో ఒక బంపర్ ఆఫర్ దక్కించుకుంది.2012 లో అజయ్ దేవగన్(Ajay devgn)హీరోగా తెరకెక్కిన సన్ ఆఫ్ సర్దార్ కి సీక్వెల్ గా ఇప్పుడు సన్ ఆఫ్ సర్దార్ 2 తెరకెక్కబోతుంది.ఇప్పుడు ఈ మూవీలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ చేయబోతుంది.ఈ మేరకు త్వరలోనే మేకర్స్ నుంచి అధికార ప్రకటన కూడా రానుంది.ఇప్పటికే మృణాల్ హిందీ లో పలు చిత్రాల్లో నటించింది.కానీ ఇంతవరకు సరైన బ్రేక్ రాలేదు.ఇక సన్ ఆఫ్ సర్దార్ తెలుగులో సునీల్ హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మర్యాద రామన్న’మూవీకి రీమేక్ గా తెరకెక్కింది. తెలుగులో పార్ట్ 2 రాకపోయినా హిందీలో తెరకెక్కుతుండటం విశేషం.