మార్కెట్​లోకి మరో కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఎంట్రీ ఇచ్చింది! సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా.. ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగంలోకి ప్రవేశించింది. భారత్ మొబిలిటీ గ్లోబల్​ ఆటో ఎక్స్​పో 2025లో కొత్త ఈ-యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్​ని ఆవిష్కరించింది. ఇండియాలోనే బెస్ట్​ సెల్లింగ్​ మోడల్స్​లో ఒకటైన సుజుకీ యాక్సెస్​ 125 సీసీ పెట్రోల్​ స్కూటర్​కి ఇది ఈవీ వర్షెన్​గా మార్కెట్​లోకి అడుగుపెట్టనుంది. సరళమైన స్టైలింగ్, ప్రాక్టికల్ స్పెసిఫికేషన్లతో కుటుంబ కొనుగోలుదారును ఈ ఈ-స్కూటర్​ లక్ష్యంగా చేసుకుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్​లో హోండా యాక్టివా, బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ రిజ్టా, ఓలా ఎస్ 1 వంటి వాటికి కొత్త సుజుకీ ఈ-యాక్సెస్ గట్టి పోటీ ఇవ్వనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here