Tenere 700 యమహా 689సీసీ సీపీ2 సమాంతర ట్విన్ ఇంజిన్ను కలిగి ఉంది. ఇది ఎంజీ-07, ఎక్స్ఎస్ఆర్700 వంటి మోడళ్ల నుంచి చాలా ఫీచర్లను తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇది 72 హెచ్పీ పవర్, 68 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. రైడర్లకు అనుగుణంగా ఇందులో అనేక ఫీచర్లు ఉన్నాయి. హార్డ్, సాఫ్ట్ లగేజీ, అప్గ్రేడ్ చేసిన స్కిడ్ ప్లేట్లు, క్రాష్ బార్లు, ర్యాలీ సీట్లు ఉన్నాయి. ఇందులో ఒక్కొక్కటి 23 లీటర్ల రెండు ఇంధన ట్యాంకులు ఉన్నాయి. ఇది ఇంధన సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 185 కి.మీ. లీటర్కు 20 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.