“కేంద్ర సహకారంతో ఏపీ వెంటిలేటర్ స్థితి నుంచి బయటపడింది.. ఇంకా కోలుకోలేదు. అమరావతికి రూ.15 వేల కోట్లు ఇచ్చారు. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి. కేంద్రం మార్గదర్శకంలో పోలవరం డయాఫ్రమ్ పనులు మొదలయ్యాయి. కేంద్రం మద్దతుతో ఏప్రిల్ 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాం. విశాఖ ఉక్కుకు కేంద్రం రూ.11,440 కోట్ల ఆర్థికసాయం చేసి ప్రాణం పోసింది. ఇటీవల విశాఖ రైల్వేజోన్ కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు కేంద్రం మద్దతు ఇంకా కావాలి. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం మద్దతు ఇవ్వాలి. ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం కోసం నాడు భూములు ఇచ్చింది టీడీపీ ప్రభుత్వం. నేడు కేంద్ర సహకారంతో అవి పూర్తి చేశాం” -సీఎం చంద్రబాబు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here