3) ఉష్ణ మండల పండ్లు: పైనాపిల్, కివీ, ప్యాషన్ ఫ్రూట్, మామిడి, జామ వంటి పండ్లు కొల్లాజెన్‌ను పెంచుతాయి. ఇవి రుచికరమైనవి మాత్రమే కాదు, మీ శరీరానికి అంతర్గతంగా పోషణను కూడా అందిస్తాయి. పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది మీ చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. అదనంగా, బొప్పాయిలో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది, ఇది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేసే లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. (ఎక్స్‌ఫోలియేషన్ అంటే చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించే ప్రక్రియ)