ఆర్థిక ఇబ్బందులు, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న సీనియర్ నటి పావలా శ్యామల (Pavala Syamala)కు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించాడు యంగ్ హీరో ఆకాష్ జగన్నాథ్ (Akash Jagannadh). 

 

ఘట్ కేసర్ లోని ఉషా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ డెవలప్ మెంట్ సొసైటీలో ఆశ్రయం పొందుతున్నారు పావలా శ్యామల. ఆమె పరిస్థితి తెలుసుకున్న ఆకాష్.. అక్కడికి వెళ్లి ఆర్థిక సాయం అందించాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న తనకు సాయం చేసిన ఆకాష్ కు పావలా శ్యామల కృతజ్ఞతలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆకాష్ జగన్నాథ్ మంచి మనసుకు ఈ సాయం నిదర్శనంగా నిలుస్తోంది. కాగా, ప్రస్తుతం ఆకాష్ తల్వార్ అనే మూవీలో నటిస్తున్నాడు.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here