అమేజింగ్ ఫీచర్లు
ఈ బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ కారు డిజిటల్ కీ ప్లస్‌తో అమర్చబడి ఉంది. ఇది కారు ఓనర్ స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్‌ని ఉపయోగించి కారును లాక్ చేయడానికి, అన్‌లాక్ చేయడానికి, స్టార్ట్ చేయడానికి అనుమతిస్తుంది. లేన్ డిపార్చర్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ అసిస్ట్, ఆటోమేటిక్ పార్కింగ్ ఫంక్షన్‌ల వంటి డ్రైవర్ అసిస్ట్ ఫీచర్‌లతో వస్తుంది. బీఎండబ్ల్యూ ఎక్స్1 లాంగ్ వీల్‌బేస్ ఎలక్ట్రిక్ కారు మినరల్ వైట్, కార్బన్ బ్లాక్‌తో సహా డ్యూయల్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. రెండేళ్ల అపరిమిత కిలోమీటర్ వారంటీతో వస్తుంది.