బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దడమే ఖాకీ కిడ్స్ లక్ష్యం
సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు నియంత్రించడమే లక్ష్యంగా విద్యార్థి దశ నుంచి పిల్లలకు సైబర్ నేరలు, ట్రాఫిక్ సిగ్నల్స్ పై అవగాహన కల్పించి సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాడమే “ఖాకీ కిడ్స్” లక్ష్యమని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. విద్యార్థులు మంచిని స్వీకరించి చెడుకు దూరంగా ఉండాలన్నారు. తల్లిదండ్రులు, ప్రజలు పిల్లలు చెప్పితే తప్పక పాటిస్తారనే ఉద్దేశంతో ఖాకీ కిడ్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్న సైబర్ వారియర్లకు సైబర్ నేరాలు జరుగు విధానం, ఎలా అరికట్టాలి, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. విద్యార్థులు సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని, ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలలో వ్యక్తిగత గోప్యత పాటించాలని కోరారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ఓటిపి ఫ్రాడ్, సోషల్ మీడియాలో వచ్చే ఉద్యోగ ప్రకటనలు,అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే విడియో కాల్స్ కు ఫ్రాడ్, olx ఫ్రాడ్ లాంటి వాటికి దూరంగా ఉండాలన్నారు.