మార్కెట్‌లో కొబ్బ‌రికి మంచి ధ‌ర రావ‌డంతో రైతుల్లో, వ్యాపారుల్లో ఆనందం నెల‌కొంది. ఎనిమిదేళ్ల త‌రువాత కురిడీ కొబ్బరి ధ‌ర‌ రూ.20 వేల‌కు తాక‌డంతో శుభ‌ప‌రిణామంగా రైతులు ఫీలవుతున్నారు. మ‌హా కుంభ‌మేళాలో డిమాండ్ పెర‌గ‌డం, త‌మిళ‌నాడు, కేర‌ళ నుంచి ఉత్పత్తి త‌గ్గడంతో గోదావ‌రి జిల్లాల కురిడీ కొబ్బరి ధ‌ర పెర‌గ‌డానికి కార‌ణం అయింది. రాష్ట్రం నుంచి మ‌హా కుంభ‌మేళాకు కొబ్బరి కాయ‌లు వెళ్లడంతో కాసులు కుర‌వ‌డం, దేవుని చెంత‌కు చేర‌డం మ‌హా ప్ర‌స‌న్నంగా రైతులు భావిస్తున్నారు. 2027లో జ‌ర‌గ‌బోయే గోదావ‌రి పుష్కరాల్లో కూడా గోదావ‌రి జిల్లాల కొబ్బరే స‌ర‌ఫ‌రా కానున్న‌ట్లు రైతులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here