ఒక దీపం నుంచి ఇంకో దీపం ఎందుకు వెలిగించకూడదు?
- ఒక దీపం నుంచి ఇంకో దీపం ఎందుకు వెలిగించకూడదు అనేది చూస్తే.. ఒక దీపం నుంచి ఇంకో దీపం వెలిగించకూడదని పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. వీటిని పాటిస్తే సంతోషంగా ఉండొచ్చు. భవిష్యత్తులో జరిగే అశుభ సంఘటనల నుంచి బయటపడడానికి అవుతుంది. దీపంలో అగ్నిదేవుడు ఉంటాడు. మనం దీపాన్ని వెలిగించినప్పుడు అది ఇంట్లో ప్రతికూలతని ఆకర్షిస్తుంది. సానుకూల శక్తిని పెంచుతుంది.
- అలాంటప్పుడు మనం ఒక దీపం నుంచి ఇంకో దీపాన్ని వెలిగించినట్లయితే, ఆ దీపంలో ఉన్న ప్రతికూలత ఇంకో దీపానికి ప్రవేశిస్తుంది. ప్రతికూలత మొత్తం అంతమైపోకుండా మన ఇంట్లోనే మళ్లీ మళ్లీ తిరుగుతూ ఉంటుంది.
- అందుకని ఒక దీపం నుంచి ఇంకో దీపాన్ని వెలిగించకూడదు. పూర్వికులు కూడా అందుకే ఒక దీపం నుంచి ఇంకో దీపాన్ని వెలిగించకూడదని చెప్తారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.