గర్భధారణ సమయంలో గోరింటాకు పెట్టుకోకూడదా?
- ఇంటి పెద్దలు, అమ్మమ్మలు గర్భధారణ సమయంలో గోరింటాకు పెట్టుకోకూడదని చెప్తూ ఉంటారు. గర్భధారణ సమయంలో కొన్ని పనులు చేయకూడదు. ఎందుకంటే గర్భధారణ సమయంలో కొన్నిటి వలన కడుపులో పెరుగుతున్న బిడ్డకు హాని కలగవచ్చు. వీటిలో ఒకటి గోరింటాకు. అందుకే పూర్వీకులు దీనిని నిషేధించారు.
- అమ్మమ్మలు వాళ్ళు చెప్పే వాటిని చాలా మంది కొట్టి పారేయొచ్చు. కానీ దాని వెనక శాస్త్రం ఉంది. కాబట్టి పూర్వీకులు చెప్పిన వాటిని పాటిస్తే సంతోషంగా ఉండొచ్చు.
- గోరింటాకు ఆనందం, ప్రేమ, అందాన్ని సూచించే శుక్ర గ్రహానికి సంబంధించినది. గోరింటాకు పెట్టుకోవడం వలన శుక్ర గ్రహం శక్తిని తీవ్రతరం చేస్తుంది.
- సామరస్యం, శ్రేయస్సు, భావోద్వేగ సమతుల్యతలను కూడా నిర్వహిస్తుంది. అందుకని పెళ్లి సమయంలో వధువులు చేతులకి గోరింటాకుని పెట్టుకోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. కనుక గర్భిణీలు గోరింటాకు పెట్టుకోకపోవడమే మంచిది.
- దీని వలన గర్భధారణ సమయంలో గ్రహాల ప్రభావం పట్ల స్త్రీ సున్నితత్వం గణనీయంగా పెరుగుతుంది. గర్భిణీ స్త్రీ జాతకంలో శుక్రుడు బలహీనంగా బాధతో లేదా అశుభంగా ఉన్నట్లయితే గోరింటాకు పెట్టుకోవడం సానుకూల ప్రభావాలకు బదులుగా ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది.
- గర్భధారణ సమయంలో జాతకంలో శని, రాహువు లేదా కేతువు వంటి గ్రహాలు బలంగా ఉన్నట్లయితే గోరింటాకు పెట్టుకోవడం ఇంకా హానికరం. ఇబ్బందులు, ఆందోళన, ఒత్తిడిని పెంచుతుంది. ప్రమాదాలు లేదంటే ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి గర్భధారణ సమయంలో గోరింటాకును పెట్టుకోకూడదని పండితులు కూడా సూచిస్తున్నారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.