కన్నడ నాట ప్రముఖ హీరో సుదీప్(Sudeep)కి ఉన్న క్రేజ్ గురించి అందరకి తెలిసిందే.అక్కడున్న స్టార్ హీరోస్ లో ఒకడైన సుదీప్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.రీసెంట్ గా’మాక్స్'(Max) అనే మూవీతో మంచి విజయాన్ని కూడా అందుకున్నాడు.డిసెంబర్ 25 న విడుదలైన ఈ మూవీ తెలుగులో కూడా అదే డేట్ కి  రిలీజయ్యి ప్రేక్షకాదరణని పొందింది.

సుదీప్ ఒక పక్కన సినిమాలు చేస్తూనే  కన్నడనాట ప్రసారమయ్యే బిగ్ బాస్(Big Boss)షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.పదకొండు సీజన్ల నుంచి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సుదీప్ ఆ షో  కి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడని చెప్పవచ్చు.ఇక ఈ షో కి సుదీప్ గుడ్ బై చెప్పబోతున్నాడు.ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తు’నేను ఈ నిర్ణయాన్నిఎప్పుడో తీసుకోవాల్సింది.ఎందుకంటే ‘బిగ్ బాస్’ షో  కి వేరే భాషల్లో వచ్చినంత క్రేజ్ కన్నడ నాట రాలేదు.అంతర్గతంగా జరిగిన కొన్ని లోటుపాట్లతో పాటు శ్రమకి తగిన గుర్తింపు కూడా రాలేదు.

ఇక్కడ కేటాయించే సమయాన్ని సినిమాలపై దృష్టి పెడితే బాగుంటుందనిపించింది.అందుకే బిగ్ బాస్ హోస్టింగ్ కి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నటుగా ఎక్స్ వేదికగా తెలియచేసాడు.ప్రస్తుతం బిగ్ బాస్ 11 వ సీజన్ కన్నడ నాట టెలికాస్ట్ అవుతుండగా,ఈ నెల 26 న జరిగే గ్రాండ్ ఫినాలే తో ముగియనుంది. సీజన్ 1 నుంచి సుదీప్ నే హోస్ట్ గా వ్యవహరిస్తు వస్తున్నాడు. 

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here