జొమాటో మొత్తం వ్యయాలు రూ. 3,383 కోట్ల నుంచి రూ. 5,533 కోట్లకు పెరిగాయి. ఫుడ్ డెలివరీ కంటే బ్లింకిట్ వేగంగా వృద్ధి చెందుతుండగా, ప్రత్యర్థి స్విగ్గీకి చెందిన ఇన్స్టామార్ట్, స్టార్టప్ జెప్టో, ఫ్లిప్కార్ట్, బిగ్ బాస్కెట్ వంటి ప్రత్యర్థుల నుంచి పోటీని ఎదుర్కొంటోంది. ఈ త్రైమాసికంలో బ్లింకిట్ రూ. 103 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది.