AP IAS IPS Transfers : ఏపీలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ట్రాన్స్ ఫర్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 మంది ఐఏఎస్ లు, 27 మంది ఐపీఎస్ లను సీఎస్ విజయానంద్ బదిలీ చేశారు. ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మన్ గా రాజీవ్ కుమార్ మీనాను నియమించారు. ఏపీఎస్పీ బెటాలియన్‌ ఐజీపీగా బి.రాజకుమారి, శాంతిభద్రతల అదనపు డీజీగా ఎన్‌.మధుసూదన్‌రెడ్డి నియమితులయ్యారు. ఐజీపీ (ఆపరేషన్స్),టెక్నికల్‌ సర్వీసెస్‌ ఐజీపీ(అదనపు బాధ్యతలు) సీహెచ్‌ శ్రీకాంత్‌, ఏపీ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ డైరెక్టర్‌గా జి. పాలరాజు బదిలీ అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here