ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)వన్ మాన్ షో పుష్ప 2(Pushpa 2)సాధించిన ఘన విజయం అందరకి తెలిసిందే. 1800 కోట్ల రూపాయిల క్లబ్ లో చేరిన ఈ మూవీ మరికొన్ని రోజుల్లో 50 రోజుల వేడుకని జరుపుకోనుంది.సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలోని చాలా సీన్స్ ప్రేక్షకులని ఎంతగానో అలరించాయి.ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్స్ లో అల్లు అర్జున్,రష్మిక  వచ్చిన సీన్స్ అయితే మెస్మరైజ్ చేశాయని చెప్పవచ్చు.

ఇక సుకుమార్ కూతురు సుకృత వేణి కీలక పాత్రలో నిర్మాణం జరుపుకున్న’గాంధీ తాత చెట్టు’ ఈ నెల 24 న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా జరుగుతున్న ప్రమోషన్స్ లో భాగంగా సుకుమార్ వైఫ్ తబిత పుష్ప 2 లోని సీన్స్ గురించి మాట్లాడుతు  వైఫ్ అండ్ హస్బెండ్ కెమిస్ట్రీ చాలా వరకు తమ నిజ జీవితంలో జరిగినవే.వాటినే సుకుమార్ కాపీ చేసి పుష్ప 2 లో పెట్టారని చెప్పుకొచ్చింది.ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి.

గాంధీ తాత చెట్టు ని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా సుకుమార్ కథ ని అందించడం  జరిగింది.బాను ప్రకాష్,ఆనంద్ చక్రపాణి,రాగ్ మయూర్,నేహాల్ ఆనంద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here