ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్(Allu arjun)రష్మిక,(Rakshmika)సుకుమార్(Sukumar),మైత్రి మూవీ మేకర్స్(Mythri movie makers)దేవిశ్రీప్రసాద్(Devisri prasad),చంద్రబోస్(Chandrabose)కాంబోలో పుష్ప పార్ట్ 1 కి సీక్వెల్ గా,డిసెంబర్ 5 న రిలీజైన పుష్ప 2 సాధించిన విజయం అందరకి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ మూవీ 1800 కోట్ల పైగా గ్రాస్ కలెక్ట్ చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది.ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే అక్కడి హీరోలకి సైతం సాధ్యం కానీ రీతిలో 800 కోట్ల రూపాయలని సాధించిందంటే పుష్ప 2 మానియాని అర్ధం చేసుకోవచ్చు.
ఇక ఈ మూవీ జనవరి 23 న 50 రోజుల వేడుకని జరుపుకోబోతుంది.దీంతో అల్లు అర్జున్ అభిమానుల్లో సంబరాలు మొదలయ్యాయి. కానీ ఇంతవరకు మేకర్స్ నుంచి ఎన్ని సెంటర్స్ లో 50 రోజులు జరుపుకోబోతుందనే పోస్టర్ రాకపోవడంతో నిరుత్సాహంతో ఉన్నామని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.సినీ ట్రేడ్ సర్కిల్స్ ప్రకారం హిందీ,తెలుగు వెర్షన్ లో నెంబర్ ఆఫ్ థియేటర్స్ లోనే యాభై రోజులు జరుపుకోబోతుందనే టాక్ వినపడుతుంది.
పుష్ప 2 నిన్న కూడా వరల్డ్ వైడ్ గా తొంబై ఆరు లక్షలు నెట్ కలెక్షన్స్ ని సాధించింది.మరి ఇప్పటివరకు అమీర్ ఖాన్ దంగల్ పేరు మీద ఉన్న 2000 కోట్ల కలెక్షన్స్ ని పుష్ప 2 అందుకుంటుందేమో చూడాలి.