YS Jagan : మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు, కేసుల ట్రయల్ బదిలీ చేయాలని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లలో సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరోసారి ఈ కేసు విచారిస్తున్న ధర్మాసనాన్ని సుప్రీం కోర్టు రిజిస్ట్రీ మార్పు చేసింది. గతంలో విచారించిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం నుంచి, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనానికి సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మార్చింది. తొలుత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం విచారించగా, కేసు విచారణ నుంచి జస్టిస్ సంజయ్ కుమార్ తప్పుకున్నారు. దీంతో పిటిషన్‌ను జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనానికి మార్చారు.
Home Andhra Pradesh మాజీ సీఎం జగన్ బెయిల్ రద్దు కేసులో కీలక పరిణామం, మళ్లీ ధర్మాసనాన్ని మార్చిన సుప్రీం...