ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ను ఉప ముఖ్యమంత్రి చేయాలంటూ పలువురు టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేయడంపై తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ స్పందించారు. జనసేన నేతల దృష్టిలో మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదని, సీఎం చంద్రబాబుతో కలిపి నలుగురని ఆయన చెప్పారు. మాకు పవన్ సీఎం కావాలని పదేళ్లుగా ఉందన్నారు.