రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు డొనాల్డ్ ట్రంప్. ఈ నేపథ్యంలోనే ట్రంప్ విక్టరీ ర్యాలీ నిర్వహించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు వాషింగ్టన్ డీసీలో నిర్వహించిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ట్రంప్ అభిమానులు పాల్గొన్నారు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ పేరుతో ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకానిక్ స్టెప్పులతో ట్రంప్ ఆకట్టుకున్నారు.