ఇటీవల పరిణామాలు చూస్తుంటే కూటమిలో చీలిక తప్పదేమోనన్న సందేహం కలుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాకినాడ పోర్టు, తిరుపతి తొక్కిసలాట వ్యవహారంలో పవన్ కల్యాణ్ దూకుడుగా వ్యవహరించడంతో…లోకేశ్ ను రంగంలోకి దింపాలని టీడీపీ భావిస్తుంది. కూటమి పార్టీలు జట్టు కట్టే సమయంలో చంద్రబాబు సీఎం, డిప్యూటీ సీఎంగా పవన్ ఒక్కరే ఉండాలన్న ఒప్పందం జరిగిందని విశ్లేషకులు అంటున్నారు. లోకేశ్ కు డిప్యూటీ సీఎం అంశం తెరపైకి రావడంతో…మూడు పార్టీలు చర్చించుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని అంటున్నారు.రాజకీయ పార్టీల్లో ఇలాంటి డిమాండ్లు సహజమేనని, తమ నేతను ఉన్నతస్థాయిలో చూడాలని శ్రేణులు భావిస్తుంటాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ వ్యవహారం చేయిదాటిపోకముందే ఇరు పార్టీల అధినేతలు కల్పించుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
Home Andhra Pradesh ఏపీలో ముదురుతున్న డిప్యూటీ సీఎం, సీఎం వ్యవహారం- సోషల్ మీడియాలో టీడీపీ,జనసేన మధ్య వార్-ap tdp...