నిస్సాన్ మాగ్నైట్
నిస్సాన్ మాగ్నైట్ ఆటోమేటిక్ వేరియంట్‌ను రూ. 6,59,900 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇందులో ఇచ్చిన 1.0L పెట్రోల్ ఇంజన్ 71 బీహెచ్పీ శక్తిని, 96 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని మైలేజ్ 19.7 కిలో మీటర్ల వరకు ఉంటుంది. నిస్సాన్ మాగ్నైట్ వైర్లెస్ ఛార్జింగ్, వాక్-అవే లాక్‌తో కూడిన 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, స్టోరేజ్, క్లైమేట్ కంట్రోల్‌తో ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్, 360 డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్లు, ఎమర్జెన్సీ స్టాప్ వంటి ఫీచర్లను వస్తాయి. ఈబీడీతో పాటు సిగ్నల్, ఈఎస్సీ, టీపీఎంఎస్, ఏబీఎస్ వంటి అన్ని భద్రతా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.