భార్య తబస్సుం ఇంటివద్దే ఉంటుంది. ఈ క్రమంలో ఇట్టిపక్కనే కూరగాయలు అమ్మే నదీముల్లాతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో భార్య వ్యవహారం గురించి ఆనోటా ఈనోటా చర్చ జరిగి, భర్త ఎస్.అల్లాబకాష్ చెవిలో పడింది. భార్య తబస్సుంను భర్త నిలదీశాడు. దీంతో వారిమధ్య తరచూ గొడవులు జరిగేవి. దీంతో ప్రియుడి వ్యామోహంలో తబస్సుం, కట్టుకున్న భర్తను అడ్డుతొలగించుకోవాలని అనుకుంది. ప్రియుడితో ఈ విషయం చెప్పి, తన భర్తను హత్య చేయాలని కోరింది. ఈనెల 18న ప్రియుడిని ఇంటికి పిలిచింది. ఇంట్లో కుమారులు లేని సమయంలో భర్త గాఢనిద్రలో ఉండగా ప్రియుడితో కలిసి గొంతుకు చున్నీచుట్టి, ఆపై గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం ఏమీ తెలియనట్లు ప్రియుడు వెళ్లిపోయాడు. తబస్సుం కూడా ఏమీ జరగనట్లు ఇంట్లోనే ఉంది.
Home Andhra Pradesh ఇంటిపక్క వ్యక్తితో వివాహేతర సంబంధం, ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య-satyasai wife killed husband...