మటన్, శెనగపప్పు రెండిట్లో కూడా పోషకాలు అధికంగానే ఉంటాయి. అరకిలో మటన్ తెచ్చినప్పుడు ఒక కప్పు శనగపప్పు వేయడం వల్ల కూర కూడా ఎక్కువ అవుతుంది. ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉన్న ఇంట్లో ఇలా పప్పు, మటన్ కలిపి వండడం వల్ల అందరికీ సరిపోయేలా చేసుకోవచ్చు. పోషకాహార లోపం రాకుండా కూడా ఈ రెండూ అడ్డుకుంటాయి.